Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9 జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా నమోదు
- దస్తూరాబాద్(నిర్మల్)లో 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత
- వచ్చే నాలుగు రోజుల్లో 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం
- పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం 9 జిల్లాలో 42 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా దస్తూరా బాద్లో అత్యధికంగా 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో అదనంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత లు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతా వరణ కేంద్రం ప్రకటించింది.
41 డిగ్రీలు దాటిన జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేస్తున్నది. ఆ జాబితాలో ఆదిలాబాద్, నిర్మల్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలున్నాయి. ఎండలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.