Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెఘా సంస్థకు ప్రశంస
హైదరాబాద్ : కాశ్మీర్‌ను కన్యాకుమారితో అనుసంధానం చేయాలనే కలను సాధించడంలో జోజిలా టన్నెల్ కీలకపాత్ర పోశిస్తుందని కేంద్ర రోడ్డు, రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. జోజిలా టన్నెల్ నిర్మాణ పనుల పట్ల మంత్రి సంతప్తి వ్యక్తం చేశారని మెఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) ఓ ప్రకటనలో తెలిపింది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి అల్కా ఉపాధ్యాయతో కలిసి జోజిలా టన్నెల్‌ను మంత్రి గడ్కరీ పనుల పురోగతిని సోమవారం పరిశీలించారు. ఎంఇఐఎల్ డైరక్టర్ సి.హెచ్ సుబ్బయ్య, జోజిలా ప్రాజెక్ట్ హెడ్ హర్పాల్ సింగ్ వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్ట్ పనుల పురోగతి గురించి వివరించారు. జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్‌ను ఎంఇఐఎల్ నిర్మిస్తోంది. జోజిలా టన్నెల్‌ను సందర్శించిన గడ్కరీ.. టన్నెల్ లోపలికి వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. పనుల పురోగతి పట్ల గడ్కరీ సంతృప్తి వ్యక్తం చేశారు. ''ఈ ప్రాజెక్ట్ ఇండియాలో భారీ గేమ్ ఛేంజర్ కాబోతుంది. కాశ్మీర్ లోయ, లడఖ్ మధ్య సంవత్సరం పొడవునా కనెక్టివిటీని అందిస్తోంది. అంతేకాకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారిని అనుసంధానం చేస్తోంది. క్లిష్టమైన వాతవరణ పరిస్థితుల్లో ప్రాజెక్ట్‌లో పనులు కొనసాగిస్తున్న ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు అభినందనలు. టన్నెల్లో దాదాపు 38 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్ పర్యాటక రంగాన్ని అభివద్ధి చేస్తుంది. దీనివల్ల ఉపాధి పెరుగుతుంది. ఇక్కడ రిసార్ట్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్ వంటివి నిర్మిస్తూ.. కాశ్మీర్‌ను మరో స్విట్జర్లాండ్‌లా తీర్చిదిద్దుతాం'' అని గడ్కరీ తెలిపారు. 2026 నాటికి ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హర్పాల్ సింగ్ తెలిపారు. కాశ్మీర్ లోయ, లడఖ్ ప్రాంతం మధ్య అన్ని వాతావరణాలకు అనుసంధానంగా ఉండేలా వ్యూహాత్మకంగా జాతీయ రహదారిపై 11,578 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న జోజిలా సొరంగం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. రెండేళ్లలో అప్రోచ్ రోడ్డు పనులు ప్రారంభిమిస్తామని తెలిపారు.