Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుస్సేన్‌సాగర్ తీరంలో 125 అడుగుల నిర్మాణం
- పనులను పరిశీలించిన మంత్రులు, సీఎస్, డీజీపీ
నవతెలంగాణ-హైదరాబాద్
బీఆర్కేఆర్ భవన్లో ఎస్సీల అభివద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆర్థిక మంత్రి టి హరీశ్‌రావు, ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ఈ నెల 14న అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై సమీక్షించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబం ధించి పూర్తిస్థాయి ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నామని పేర్కొన్నారు. పోలీసు శాఖ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేస్తుందనీ, ఆర్ అండ్ బీ శాఖ లైటింగ్, షామియానా, కుర్చీలు, పూలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. విద్యుత్ శాఖకు నిరంతర విద్యుత్ అందించాలనీ, ట్రాన్స్ఫార్మర్లను సిద్ధంగా ఉంచాలని కోరారు. అలాగే ఆరోగ్య సిబ్బందితో పాటు అంబులెన్స్‌ను సిద్దంగా ఉంచాలని ఆరోగ్య శాఖను ఆదేశించామని తెలిపారు. ప్రజాప్రతినిధులతో పాటు జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు సరైన సీటింగ్ ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు నీరు, మజ్జిగ, మిఠాయిలు అందించాలి. 14వ తేదీన వాహనాల రాకపోకల కోసం నెక్లెస్ రోడ్డు మూసివేయనున్నందున ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించాలని ప్రజలకు ముందస్తుగా తెలియజేయాలని పోలీసులకు సూచించారు. అదేవిధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీని ఆదేశించారు. ఈ సమావేశానికి ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ఆర్ అండ్ బీ సెక్రటరీ శ్రీనివాస్‌రాజు, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.