Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెర్ప్ సీఈఓ సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్(ఎన్ఆర్ఎల్ఎమ్)లో భాగంగా ఇంటింటి సర్వే ఆన్లైన్ నమోదును యుద్ధ ప్రాతిపదికపై పూర్తిచేయాలని సెర్ప్ సీఈఓ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. మంగళవారం రాష్ట్రంలోని, జిల్లా గ్రామీనాభివృద్ధి అధికారులు, అదనపు డీఆర్డీఓలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహిచారు. ''లక్ పతి దిది'' సర్వే ఆన్లైన్ నమోదు ప్రగతిని సమీక్షించారు. ఇప్పటి వరకు దాదాపు 65 శాతం మాత్రమే నమోదు జరిగిందనీ, మిగిలిన 35 శాతం సర్వే నమోదు 4 రోజుల్లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలలోని ప్రతి సభ్యురాలిని లక్షాధికారిగా చేయడానికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రణాళికలు రూపొందించారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ వారీగా వారి వ్యక్తిగత ఆర్థిక అభివృద్ధితో పాటు గ్రామ మౌలిక సౌకర్యాలను సర్వే ద్వారా గుర్తించి ప్రణాళికలు రూపొంది ంచారు. సర్వే నమోదు విషయంలో సాంకేతిక సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని నొక్కిచెప్పారు. కొందరు సమ్మెలో ఉన్నారని సాకుగా చూపి మరింత జాప్యం చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో తరచూ క్షేత్ర స్థాయిలో సమీక్షించాలని సెర్ప్ డైరెక్టర్ వైఎన్.రెడ్డిని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కోసం చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓలను కోరారు. కలెక్టర్ల ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి కమీషన్ ఏదైనా పెండింగులో ఉంటే వెంటనే పౌరసరఫరాల శాఖకు ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఆయన సూచించారు.