Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిమ్స్ ఆస్పత్రిలో కోత లేకుండా అరుదైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. కాథెటర్ ద్వారా మైట్రల్ వాల్వ్ మార్పిడి చికిత్సను ఆ ఆస్పత్రిలో తొలిసారిగా చేశారు. జగిత్యాలకు చెందిన దేవమ్మ (67 ) 2015 లో ఆపరేషన్ ద్వారా మైట్రల్ వాల్వ్ మార్పిడి చేయించుకుంది . ప్రస్తుతం ఆ వాల్వ్ మూసుకుపోవడంతో అవస్థ పడుతూ పలు ఆస్పత్రులు తిరిగింది. చివరకు నిమ్స్ కార్డియాలజీ విభాగం లో చేరింది. మరోసారి గుండె కోత ఆపరేషన్ చేయడమనేది రిస్క్ తో కూడుకున్నది. కాబట్టి కోత లేకుండా, తొడ నుంచి కాథెటర్ ద్వారా వాల్వ్ మార్పిడి చేశారు. ఈ శస్త్రచికిత్సను నిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డా. బి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ సతీష్ రావు, డాక్టర్ మణి కృష్ణ, డాక్టర్ హరీష్ రెడ్డి, డా.క్టర్ ప్రదీప్, డాక్టర్ సదానంద్, డాక్టర్ మెహరున్నీసాతో కూడిన బృందం విజయవంతంగా పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా చేసిన ఆర్ధిక సహాయంతో ఇది సాధ్యమైందని అధికారులు వెల్లడించారు.