Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పుటించుకున్న మహిళ
- రాజేంద్రనగర్ పరిధిలో ఘటన
నవతెలంగాణ-రాజేంద్రనగర్
దేవుడు కలలోకి వచ్చి చెప్పాడంటూ ఓ మహిళ ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పు అంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. రాజేంద్రనగర్ సీఐ నాగేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నంది ముసలైగూడకు చెందిన శివాని(35) భర్త లేకపోవడంతో తల్లితో కలిసి ఉంటుంది. స్థానికంగా భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. అయితే కొద్ది కాలంగా ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదు. మంగళవారం ఉదయం అత్తాపూర్లోని ప్రధాన రహదారి పక్కన కూర్చుని ఒకసారిగా ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకుంది. వెంటనే స్థానికులు గమనించి మంటలను ఆర్పించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. అయితే రాత్రి దుర్గాదేవి కలలో కనిపించి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పిందని, అందుకే తాను ఆత్మహత్య చేసుకున్నానని శివాని తెలిపింది. తనకు భర్త లేడని, తాను ఎవరి కోసం జీవించాలని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పోలీసులకు తెలిపింది. పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉరది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.