Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో ముగ్గురికి బెయిల్ మంజూరు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. ఈనెల 11వ తేదీన ఈ పిటీషన్‌పై కోర్టులో విచారణ జరిగిన విషయం విదితమే. కస్టడీ అవసరం లేదని, ఇప్పటికే పోలీసుల విచారణ పూర్తయిందని బండి సంజయ్ న్యాయవాదులు చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. దాంతో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను న్యాయమూర్తి డిస్మిస్ చేశారు. కేసులో కుట్ర కోణం లేదని, కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం లేదని సంజరు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. ఈ కేసులో సంజరుతోపాటు జైలుకు వెళ్లిన మరో ముగ్గురికి హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏ2 ప్రశాంత్, ఏ3 మహేశ్, ఏ5 శివగణేష్‌కు పలు కండీషన్లతోకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు కరీంనగర్ జైలు నుండి విడుదల కానున్నారు.