Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7,090కు చేరిన ఎంబీబీఎస్ సీట్లు :మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో త్వరలో మరో తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించబోతున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. మంగళవారం ఆయన బోధనాస్పత్రుల నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014-15లో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,950 ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 7,090కు చేరిందని తెలిపారు. ఎంబీబీఎస్ సీట్ల శాతం 240కు, పీజీ సీట్ల శాతం 111కు పెరిగాయని తెలిపారు. .
సూపరింటెండెంట్లదే బాధ్యత
ఎంఎన్సీ నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీల నిర్వహణ, అన్ని వైద్య పరికరాలు పని చేసేలా చూడటం, డిశ్చార్జ్ అయిన రోగులకు ఉచితంగా మందుల సరఫరా, వాటి బోర్డుల ఏర్పాటు, మెనూ ప్రకారం డైట్ అందించడం, ఆస్పత్రి పరిసరాల పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ నియంత్రణ బాధ్యత ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లదేనని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ కె.రమేశ్ రెడ్డి పాల్గొన్నారు.