Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
క్యాన్సర్ రోగుల కోసం ఎంఎన్ జే ఆస్పత్రి నిర్మించిన కొత్త బ్లాక్‌ను ఈ నెల 16న వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రారంభించనున్నారు. తద్వారా హైదరాబాద్ రెడ్‌హిల్స్ సమీపంలో 300 పడకలతో నిర్మితమైన ఈ భవనాన్ని ఆదివారం ఉదయం 10 గంటలకు రోగులకు అందుబాటులోకి తేనున్నారు. పీడియాట్రిక్ ఆంకాలజీ, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్, ఉమెన్ క్యాన్సర్ వింగ్, ఫిమేల్ లుకేమియా వార్డ్, అడల్ట్ మెడికల్ ఆంకాలజీ వంటి ప్రధాన విభాగాలను కొత్త బ్లాక్‌లో ఏర్పాటు చేశారు. వీటితో పాటు రెగ్యులర్ ఓపీని నిర్వహించనున్నారు. ఇప్పటికే 30 మంది డాక్టర్లను, 50 మంది స్టాఫ్ నర్సులను, పారామెడికల్ సిబ్బందిని నియమించారు. ఆస్పత్రిలో పారిశుధ్యం, భద్రతలను ప్రవాస భారతీయుడు డాక్టర్ శరత్‌కు చెందిన స్మార్ట స్వచ్చంధ సంస్థ మూడేండ్ల పాటు ఉచితంగా నిర్వహించేందుకు ముందుకొచ్చింది. ఆక్సిజన్ పైప్‌లైన్, 60 ఐసీయూ పడకలతో అత్యాధునిక చికిత్సలను అందించేలా ఆస్పత్రిని తీర్చిదిద్దారు. ఇన్‌పేషెంట్ రోగులకే కాకుండా డే కేర్ యూనిట్లో 50 బెడ్లతో అవుట్ పేషెంట్ రోగులకు ఒకే రోజు చికిత్సనందించి పంపించనున్నారు.