Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దస్తూరాబాద్లో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్లో రెండో వారం దాటకముందే భానుడు భగభగ మండిపోతున్నాడు. ఏప్రిల్లోనే మే నెలలో మాదిరిగా ఎండ దంచికొడుతున్నది. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో అత్యధికంగా 43.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఆదిలాబాద్ జిల్లా చాప్రాలా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోనూ 43.8 డిగ్రీల చొప్పున నమోదైంది. రాష్ట్రంలో 17 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ జిల్లాలన్నీ ఆరెంజ్ జోన్లో ఉన్నాయి.