Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫూలే జయంతి సభలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కుల రహిత, అసమానతల్లేని సమాజం కోసం సామాజిక తత్వవేత్త మహాత్మా జోతిబాఫూలే చేసిన కృషి వెలకట్టలేనిదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. ఆయన ఆశయాల సాధనలో భాగంగా వివక్ష లేని ఆధునిక సమాజ నిర్మాణమే లక్ష్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఫూలే 197వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫూలే చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ సమాజంలో పేరుకుపోయిన మూఢ విశ్వాసాలు, అజ్ఞానానికి కారణమైన మనువాద భావజాలాన్ని కూకటివేళ్లతో పెకలించాలన్నారు. విద్య ద్వారానే ప్రజలు, విద్యార్థుల్లో చైతన్యం తేవొచ్చని సూచించారు. మహిళ అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందబోదని ఆనాడే ఫూలే భావించారని గుర్తు చేశారు.