Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అంటరానితనం, కులవివక్షకు వ్యతిరేకంగా బలమైన పోరాటాలను నిర్వహించడమే జ్యోతిరావు పూలేకు అర్పించే నిజమైన నివాళి అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో పూలే 197వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత వర్గాలకు చెందిన వారు అట్టడుగు వర్గాలకు, మహిళలకు చదువును చెప్పేందుకు నిరాకరిస్తే తన భార్యకు స్వయాన చదువు నేర్పి ప్రత్యేక బడులను పెట్టి మహిళలకు చదువు నేర్పించారని గుర్తు చేశారు. పెత్తందారుల దోపిడీ, వివక్షలను వివరిస్తూ గులాంగిరి పుస్తకాన్ని రాశారని చెప్పారు. ఆధునిక సమాజంలో కూడా కులం పేరుతో గ్రామ బహిష్కరణలు, రెండు గ్లాసుల పద్దతిని పాటిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అసమానతలు లేని సమాజ స్థాపన కోసం పోరాటాన్ని నిర్వహించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ ఆంజనేయులు,గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్, రైతు సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, జంగారెడ్డి, శోభన్ నాయక్ పాల్గొన్నారు.