Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాట్లు పూర్తి : మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేట ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. మంగళవారం ఎల్బీస్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాట్లను మంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకర్లతో మాట్లాడారు. మత సామరస్యం వెల్లివిరిసే విధంగా రంజాన్ వేడుకలు నిర్వహించడం జరుగుతున్న దని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదా రు ఎకే ఖాన్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మెన్ ఇంతియాజ్, హజ్ కమిటీ చైర్మెన్ సలీమ్, వక్ఫ్‌బోర్డు చైర్మెన్ మసీవుల్లా,ఉర్దూ అకాడమీ చైర్మెన్ ముజిబ్, మైనార్టీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ నదీమ్, డైరెక్టర్ షఫీ ఉల్లాఖాన్ ఉన్నారు.