Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగ విరమణ వయస్సు 61 నుంచి 58 ఏండ్లకు కుదింపు
- ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు సర్కారు షాక్ ఇచ్చింది. ఉద్యోగ విరమణ వయస్సును 61 నుంచి 58 ఏండ్లకు కుదించింది. ఈ మేరకు ఇంటర్ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. వారి ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 ఏండ్లకు పెంచుతూ ఈ ఏడాది జనవరి 31న ఆదేశాలు జారీ చేశామని గుర్తు చేశారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరిస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్‌టైం పద్ధతిలో పనిచేస్తున్న వారి ఉద్యోగ విరమణ వయస్సు 58 ఏండ్లు ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగ విరమణ వయస్సును తగ్గించడం పట్ల టిగ్లా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం జంగయ్య, మాచర్ల రామకృష్ణగౌడ్, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం-475 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేష్ ఒక ప్రకటనలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే కాంట్రాక్టు అధ్యాపకులకూ ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని కోరారు.