Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మంథని
ప్రాజెక్టులో మునిగిన భూములకు సంబంధించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఇరిగేషన్ శాఖ ఏఈని నిర్బంధించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఆనంద గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇరిగేషన్‌శాఖ ఏఈని మంగళవారం నిర్బంధించారు. అన్నారం ప్రాజెక్టులో భాగంగా భూములు తీసుకున్న ప్రభుత్వం సుమారు 365 ఎకరాలకు క్రాప్‌హాలిడే పరిహారాన్ని ప్రకటించింది. సుమారు 8 సీజన్లకు చెందిన క్రాప్ హాలిడే కింద రావాల్సిన పరిహారంలో మూడు పంటలకు మాత్రమే ప్రభుత్వం డబ్బులు చెల్లించింది. మిగతా పరిహారం కోసం గ్రామస్తులు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో సర్వే కోసం వచ్చిన ఇరిగేషన్ శాఖ ఏఈ వెంకన్నను గ్రామస్తులు పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకటేశ్వర్ ఉన్నతాధికారులతో మాట్లాడి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఏఈని వదిలేశారు.