Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం
- ఎస్‌ఆర్‌శంకరన్ ఐఏఎస్ అకాడమీ చైర్మెన్ నంద్యాల నర్సింహారెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన ఫూలే సామాజిక విప్లవకారుడనిఎస్ఆర్శంకరన్ ఐఏఎస్ అకాడమీ చైర్మెన్ నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. అకాడమీలో ప్రిన్సిపాల్ సురేందర్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జ్యోతిరావుఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. స్వేచ్ఛ స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం, లౌకికతత్వం విలువలున్న గొప్ప రాజ్యాంగం మనదని తెలిపారు. అంటరాని తనం, మహిళలకు విద్య, వితంతు వివాహాలపై ఫూలే పోరాటం చేశారని గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడమే ఆయనకు నిజమైన నివాళని పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌శంకరన్ అకాడమీ ఆధ్వర్యంలో అతితక్కువ ఫీజులతో విద్యార్థులకు పోటి పరీక్షల శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. జ్యోతిరావుఫూలే స్మృతి సమితి నాయకులు సతీష్‌కుమార్ మాట్లాడుతూ మహిళలకు మొదటిగా విద్యను నేర్పించిన ఘనత ఫూలేకే దక్కుతుందని అన్నారు. ఆయన గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. అకాడమీ సలహాదారులు సత్యనారాయణ మాట్లాడుతూ ఏప్రిల్ మహానీయుల మాసమని, సమత, మమతల కోసం పాటుపడిన గొప్ప నాయకులు జన్మించిన సందర్భమని అన్నారు. ఫూలే వ్యక్తి కాదని, గొప్ప శక్తి అని వివరించారు. సమాజంలో సమూల మార్పుల కోసం పోరాడిన మహానాయకుడని చెప్పారు. అంతకుముందు రాజ్యాంగ పీఠికపై విద్యార్థులతో ప్రమాణం చేయించారు. మహానీయుల చిత్రపటాలకు పూలమాలలేసి నివాళలర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌శంకరన్ అకాడమీ ఏఓ కె.సతీష్‌కుమార్, కో-ఆర్డినేటర్ జనార్దన్, విద్యార్థులు పాల్గొన్నారు.