Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మను వాదంపై పోరాడటమే ఫూలేకు నిజమైన నివాళని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్ అన్నారు. మంగళవారం సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సుందరయ్య పార్కు వద్ద ఫూలే 197వ జయంతిని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనువాదులు వేల సంవత్సరాలుగా ఎస్సీ ,ఎస్టీ, బలహీన వర్గాలను శూద్రులుగా ముద్ర వేసి వారిని సమాన అవకాశాలకు దూరం చేశారని తెలిపారు.అణిచివేతకు గురిచేశారని చెప్పారు. మనుస్మృతి ఆధారంగానే ఈ విధానాన్ని అమలు చేశారని తెలిపారు. మనుస్మృతికి వ్యతిరేకంగా 150 ఏండ్ల క్రితమే ఫూలేే అనేక ఉద్యమాలు నిర్వహించారని గుర్తు చేశారు. శూద్ర కులాలు, మహిళలకు విద్యను అందించడంతోపాటు వారికి సమాన అవకాశాలు ఉండాలంటూ ఆధిపత్య బ్రాహ్మణీయ వాదానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ప్రత్యక్షంగా పాఠశాలలు నెలకొల్పి విద్యనందించారని తెలిపారు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగం స్థానంలో మనుస్కృతిని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని తెలిపారు. కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జాన్ వెస్లీ , స్కైలాబ్ బాబు, దశరథ్, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎం.వి రమణ, నరేష్, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్, మిరియం వెంకటేశ్వర్లు, రాజు, గిరిజన సంఘం హైదరాబాద్ సౌత్ జిల్లా నాయకులు ఆంగోత్ కృష్ణా నాయక్, చిన్నా,శ్రీను,ఆర్.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.