Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్ జెండావిష్కరణలో టి సాగర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరో రైతాంగ పోరాటానికి సిద్దం కావాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ పిలుపునిచ్చారు. మంగళరం హైదరాబాద్లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 88వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. జంగారెడ్డి, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, నాయకులు ఆంజనేయులు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు యం. ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు.