Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య
- సీఐటీయూ కార్యాలయంలో పూలే జయంతి
నవతెలంగాణ-అడిక్ మెట్
అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళల అభ్యున్నతి కోసం జోతిరావు పూలే అహర్నిశలూ కృషి చేశారని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అధ్యక్షతన జ్యోతిరావు పూలే జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం వీరయ్య మాట్లాడుతూ.. పూలే, అతని భార్య సావిత్రిబాయి పూలే దేశంలో మహిళలకు విద్య నేర్పడానికి మార్గదర్శకులుగా నిలిచారన్నారు. పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. 1848లో బాలికల విద్య కోసం పూలే పూణేలో పాఠశాల ప్రారంభించారని, వితంతువుల కోసం ఒక గృహాన్ని స్థాపించారని తెలిపారు. వేదాలను పవిత్రంగా భావించడాన్ని వ్యతిరేకించారని. విగ్రహారాధనను ఖండించారని చెప్పారు. నేటి తరాలకు ఆయన ఆదర్శమని, ఆశయాల సాధన కోసం పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురు ఎస్వి.రమ, పి.జయలక్ష్మి, కార్యదర్శులు జె.వెంకటేష్, బి.మధు, పి.శ్రీకాంత్, కార్యకర్తలు వై.సోమన్న, పి.సుధాకర్, ఎ.సునీత, ఎస్.ఎస్.ఆర్.ఎ. ప్రసాద్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.