Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిజిటల్ యుగంలో సాహిత్యానికి ఆదరణ
- వచ్చే ఏడాది కళాభారతిలో పుస్తకాల ప్రదర్శన :మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- నవతెలంగాణ పుస్తకప్రదర్శన ప్రారంభం
నవతెలంగాణ- మహబూబ్‌నగర్
సమాజంలో ప్రతి మనిషినీ సన్మార్గంలో నడిపేది ఒక పుస్తకం మాత్రమేనని ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ మైదానంలో మంగళవారం ఏర్పాటు చేసిన నవతెలంగాణ పుస్తక ప్రదర్శనను మంత్రి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు ప్రతి మనిషీ వేగంగా ప్రయాణిస్తూ.. ఆలోచింపజేస్తున్న డిజిటల్ యుగంలోనూ సాహితీ రంగానికి ఎంతో ఆదరణ ఉందన్నారు. ఎందరో మహనీయుల జీవిత చరిత్రలు, జ్యోతిరావు పూలేలాంటి సాహితీవేత్తలను గుర్తుకు తెచ్చేవి ఒక్క పుస్తకాలు మాత్రమేనని చెప్పారు. ఎంతటి చెడ్డవారిలోనైనా పుస్తక జ్ఞానం ద్వారా మార్పు తీసుకురావచ్చని తెలిపారు. పుస్తకాలకు సాహిత్యానికి ఆదరణ లేదంటూ చర్చ జరుగుతున్న ఈ రోజుల్లో నవ తెలంగాణ యాజమాన్యం పుస్తక సాహిత్యాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ప్రదర్శిస్తున్నందు కు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. దేశంలో మన మహనీయులు సాధించిన అనేక విజయాలను, చరిత్రను ఘట్టాలను నేటి కేంద్ర ప్రభుత్వం మరుగున పరిచేందుకు కుట్ర చేస్తుందని విమర్శించారు.
తెలంగాణ పోరాటంలో తాను ప్రత్యక్షంగా పాల్గొన్న అనేక సంఘటనలను వివిధ పత్రికల్లో ప్రచురించిన అంశాలతో ముద్రించిన పుస్తకాలను నవతెలంగాణ వారికి అందజేశారు. ప్రస్తుతం ఇక్కడ ఈ చిన్న స్థలంలో నవతెలంగాణ పుస్తక ప్రదర్శన నిర్వహించుకుంటున్నారని, వచ్చే ఏడాది నాటికి కళాభారతిని పూర్తి చేసి అందులో పెద్దఎత్తున పుస్తక ప్రదర్శన నిర్వహించడానికి అవకాశం ఇస్తామని తెలిపారు.
ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్న నవతెలంగాణ పత్రిక యాజమాన్యానికి ప్రభుత్వం తరఫున ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ జనరల్ మేనేజర్ వాసు, ఉమ్మడి జిల్లా మేనేజర్ ఎం.కార్తీక్, ప్రాంతీయ ప్రతినిధి పరిపూర్ణం, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ.రాములు, సీనియర్ నాయకులు కె.గోపాల్, నల్లవెల్లి కురుమూర్తి, చంద్రకాంత్, రాజు కుమార్, నవతెలంగాణ డెస్క్ ఇన్చార్జి భాస్కర్, విలేకరి జనార్ధన్, బుకహేౌస్ ఇన్చార్జి సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.