Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యవహారాన్ని తేల్చాలి
- టీఎస్పీఎస్సీ అభ్యర్ధులకు నెలకు రూ.20వేలు ఇవ్వాలి
- సీఎం కేసీఆర్ స్పందించాలి
- ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ మహాదీక్షలో వక్తలు
- దీక్షను ప్రారంభించిన జాన్‌వెస్లీ
- నిమ్మరసం ఇచ్చి విరమింపచేసిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రమేయాన్ని నిగ్గుతేల్చాలని కోరారు. భారత విద్యార్థీ సమాఖ్య (ఎస్ఎఫ్ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర శాఖల సంయుక్తాధ్వర్యంలో మంగళవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద మహా దీక్ష నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టీ నాగరాజు, ఉపాధ్యక్షులు టీ రవి, మిశ్రీన్, ప్రశాంత్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేష్, ఉపాధ్యక్షులు బషీర్, జావేద్, నవీన్, జగన్, కృష్ణనాయక్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. ఎస్ఎఫ్ఐ మాజీ నేత, కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ వారందరికీ పూలమాలలు వేసి దీక్షల్ని ప్రారంభిం చారు. ఎస్ఎఫ్ఐ మాజీ నేతలు మూడ్ శోభన్, ఎస్ వీరయ్య, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరాంనాయక్, ప్రయివేట్ టీచర్స్, లెక్చరర్స్ అసోసియేషన్ కన్వీనర్ విజయకుమార్ తదితరులు పాల్గొని, వారి దీక్షలకు మద్దతు ప్రకటించారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మహేష్, శ్రీకాంత్, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి సందీప్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పీ లక్ష్మణ్, పీడీఎస్‌యూ అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, సందీప్, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్, ఎన్పీఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ తదితరులు 'మహాదీక్ష'కు సంఘీభావం ప్రకటిం చారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రశ్నా పత్రాల లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ, బండి సంజరు వ్యవహారంపై రాజ కీయ కుట్రకోణంలో విచారణ జరపాలని కోరారు. పోటీ పరీక్షలకు దాదాపు 30 లక్షల మంది నిరు ద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారనీ, మళ్లీ పరీక్షలు సక్రమంగా నిర్వహించే వరకు వారందరికీ ప్రతినెలా రూ.20వేలు బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేశారు. ఏటా ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిం చాలనీ, నియామకాలను పారదర్శకంగా చేపట్టాలని కోరారు. ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదంటూ ఆక్షేపణలు వస్తున్నా యనీ, సీబీఐ విచారణపైనా విశ్వాసం లేదన్నారు. అందువల్ల హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీని కూడా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజ కీయాలకు వాడుకుంటున్నా యనీ, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎవరి కి అనుకూలమైన రాజకీయం వారు చేసుకుంటున్నా రే తప్ప, నిరుద్యో గుల మనోవేదనను ఆర్థం చేసు కోవట్లేదన్నారు. కేంద్రం ఏటా రెండు కోట్ల ఉద్యోగా లిస్తామని హామీ ఇచ్చిందనీ, రాష్ట్ర ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి, ఇద్దరూ మాట తప్పారని విమర్శిం చారు. విద్యారంగంలో మనుధర్మశాస్త్రాన్ని అమలు చేయాలని బీజేపీ కుట్రలు చేస్తున్నదనీ, దానిలో భాగంగానే భగత్‌సింగ్ సహా అనేకమంది దేశభక్తుల పాఠ్యాంశాలను తప్పించి, కాషాయీకరణ చదువుల్ని చొప్పించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. లీకేజీల కారణంగా మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు.
దీక్ష విరమణ
మహాదీక్షలో కూర్చున్న నాయకులకు సాయంత్రం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక కష్టనష్టాల కోర్చి, పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతూ, లీకేజీలతో మనోధైర్యం కోల్పోతున్న నిరుద్యోగులకు భరోసా కల్పించాలని చెప్పారు. లీకేజీలతో నష్టపోయిన తెల్లరేషన్ కార్డు నిరుద్యోగులకు ప్రతినెలా రూ.50 వేలు వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై చట్టసభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.