Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిప్పుల కొలిమిలా రామగుండం
- ఇప్పుడే 44 డిగ్రీలు నమోదు
- వడగాలులు తోడవడంతో జనం బెంబేలు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
వారం రోజులుగా ఎండలు ఠారెత్తిస్తు న్నాయి. మార్చి చివరి వారం నుంచే ఎండలు ముదరగా.. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు 40డిగ్రీల నుంచి 43డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. అందులోనూ బొగ్గుగనుల క్షేత్రమైన రామగుండంలో నాలుగు రోజులుగా నాలుగు డిగ్రీల ఎండ పెరిగి 44డిగ్రీలు నమోదవుతోంది. దీంతో రామగుండం నిప్పుల కొలిమిలా మారింది. ఇప్పుడే ఎండలతో మండిపోతుంటే.. వచ్చే మేలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం బెంబేలెత్తుతున్నారు. వడగాడ్పులు తోడవడంతో వడదెబ్బకు జనం గురవుతున్నారు.ఐదేండ్ల వాతావరణ రికార్డుల ప్రకారం.. రామగుండంలో మే చివరినాటికి 48, 49డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 50 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడున్న ఎండలను చూస్తుంటే మే నాటికి రామగుండంలో 50డిగ్రీలు దాటి ఎండలు దంచికొట్టే అవకాశం లేకపోలేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పారిశ్రామిక ప్రాంతం కావడంతో సాధారణం కంటే కొద్ది గా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతూ ఉం టాయి. సింగరేణి, నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్(ఎన్టీపీసీ), సోలార్ పవర్ ప్లాంట్లు, కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ, ఆర్ఎఫ్సీఎల్, టీ- జెన్కో ఉన్న ఈ ప్రాంతం ఉత్తర తెలంగాణ లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఏరి యాగా చెప్పొచ్చు. సింగరేణి బొగ్గుగని కార్మి కులు ఓసీపీ గనుల్లో బొగ్గు ఉత్పత్తులను మం డుటెండల్లోనే జరుపుతున్నారు. బొగ్గు గనుల నుంచి వెళ్ళే వేడితోపాటు ఎండ తీవ్రతకు తట్టుకోలేకపోతున్నారు.ఈ ప్రాంతాల్లో మధ్యా హ్నం డ్యూటీల నుంచి విరామం కల్పించాల ని కార్మికులు కోరుతున్నారు. జగిత్యాల, కరీం నగర్, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో కూడా వారం రోజులుగా 41 డిగ్రీల నుంచి 42 డిగ్రీలు నమోదవుతున్నాయి. మార్చి రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరగడంతో అనారోగ్యం బారిన పడి ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. శుభకార్యాలు, విహారయాత్రలు వెళ్లేవారు తప్పనిసరి జాగ్రత్త లు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.