Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఖమ్మం జిల్లా చీమలపాడులో బీఆర్ఎస్ నేతల నిర్లక్ష్యం వల్ల బాణాసంచా నిప్పురవ్వలు ఓ ఇంటిపై పడి నలుగురు మృతి చెందడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మృతుల, క్షతగాత్రుల కుటుంబాలకు అన్ని విధాలుగా సాయం చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నేతల ఆనందం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏమిటని ప్రశ్నించారు. బాణాసంచా పేలి ఇద్దరు చనిపోయిన ఘటనకు బాధ్యులైన బీఆర్ఎస్ నేతలపై తక్షణమే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ కల్తీకల్లు తాగి ఒకరు చనిపోవడం, పలువురు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండటం బాధాకరమని పేర్కొన్నారు. తన సొంత జిల్లాలో కల్తీకల్లు ఏరులైపారుతుంటే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.