Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు (డీజీఈ)గా ఎ కృష్ణారావు బుధవారం పూర్తిస్థాయి బాధ్యతలను స్వీకరించారు. ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులుగా పనిచేసిన అలుగుబెల్లి సత్యనారాయణరెడ్డి గుండెపోటుతో మరణించడంతో గతేడాది, జనవరి 20వ తేదీన ఆయనకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులుగా కృష్ణారావుకు పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఈనెల మూడో తేదీన ఉత్తర్వులు విడుదల చేశారు. అయితే కుటుంబ ఇబ్బందుల నేపథ్యంలో ఆయన సెలవులో ఉన్నారు. ఇప్పటి వరకు విద్యాశాఖ అదనపు సంచాలకులు కె లింగయ్య ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులుగా వ్యవహరించారు. బుధవారం కృష్ణారావు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులుగా పూర్తిస్థాయి బాధ్యతలను స్వీకరించారు.