Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసును నీరుగార్చేందుకు కుట్ర
- 17న ఇందిరాపార్కు వద్ద నిరహారదీక్ష : వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
'టీఎస్పీఎస్సీలో 15 పేపర్లు లీకైతే 6 పేపర్లను రద్దుచేస్తారా? ఈ కేసులో కీలక నిందితులు ఇద్దరేనా? డ్రగ్స్ కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులాగే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ కేసునూ సిట్ నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఒక్క పేపర్ లీకైతేనే బయటికి పొక్కే విషయం 15 పేపర్లు లీక్ అయ్యేదాకా బయటకు రాలేదంటే ఇందులో ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేదంటారా?' అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల అనుమానం వ్యక్తం చేశారు.ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంత జరిగినా బోర్డును ప్రక్షాళన చేయలేదంటే ఇంకా కొలువులు అమ్ముకునే ఉద్దేశం మీకుందా? అని ప్రశ్నించారు. ప్రమేయంలేనప్పుడు సీబీఐ దర్యాప్తునకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. నిరుద్యోగుల కోసమే టీ-సేవ్ ఫోరం ఏర్పడిందని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం జరిగేవరకు పార్టీలకు అతీతంగా అది పోరాడుతుందని తెలిపారు. అందులో భాగంగా ఈనెల 17న ఇందిరాపార్కు వద్ద జరిగే నిరహార దీక్షకు పెద్దఎత్తున తరలిరావాలని నిరుద్యోగులకు ఆమె పిలుపునిచ్చారు.