Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలో రెండో ఆర్థిక సంఘానికి చైర్మెన్, నలుగురు సభ్యులను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరింది. ఈ మేరకు గవర్నర్కు బుధవారం లేఖ రాసింది. ఈ సందర్భంగా ఫోరం కార్యదర్శి పద్మనాభరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక సంఘం రాష్ట్రం పన్ను ఆదాయంలో పంచాయతీలకు వాటాను నిర్ధేశిస్తుందని అన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ అసెంబ్లీలో పెంచాల్సి ఉందని గుర్తుచేశారు. మొదటి ఆర్థిక సంఘం పదవీకాలం ముగియడంతో పంచాయతీలకు హక్కుగా రావాల్సిన నిధులు రావడంలేదని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకునే విధంగా గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు.