Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ దూదిమెట్ల బాల్రాజ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వివిధ రకాల ప్రమాదాల్లో మరణించిన గొర్రెలను కోల్పోయిన కాపరులను ఆదుకునేందుకు వీలుగా ' కేసీఆర్ జీవబంధు పథకం' కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్టు తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకందారుల అభివృద్ధి సమాఖ్య చైర్మెన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో సమావేశమయ్యారు. రెండో విడత గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన ఏర్పాట్లు, విధి విధానాలు, అమలుపై చర్చించారు.జీవబంధు పథకం కోసం ''గొర్రెల మంద వద్దపల్లె నిద్ర-గొర్ల కాపరులతో మాట ముచ్చట''లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి సమగ్రంగా అధ్యయనం చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఏటా 6 వేల గొర్రెలు వివిధ ప్రమాదాల్లో మరణిస్తున్నాయని చెప్పారు. రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా రూ.6,125 కోట్లతో లబ్ధిదారులకు 3.50 లక్షల యూనిట్ల ద్వారా దాదాపు 80 లక్షల గొర్రెలను అందించనున్నట్టు తెలిపారు.