Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూలిరేట్ల చెల్లింపు అవకతవకలపై చర్యలు తీసుకోవాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సివిల్ సప్లరు హమాలీలకు అమలు చేస్తున్న పీిఎఫ్ సౌకర్యాన్ని గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ హమాలీలకు కూడా అమలు చేయాలని తెలంగాణ ఆల్ హమాలీ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు, సివిల్ సప్లరు, జీసీసీ హమాలీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి. సుధాకర్ డిమాండ్ చేశారు. హమాలీలకు పెరిగిన కూలి రేట్లతో పాటు బోనస్ స్వీట్ బాక్స్, స్టిచ్చింగ్చార్జి, స్వీపర్లకు పెరిగిన వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. బుధవారం హైదరాబాద్లో గిరిజన సహకార సంస్థల కార్పొరేషన్ శాఖ కమిషనర్ కిస్టినా జెడ్ చొంగ్తూ, సివిల్ సప్లరు కార్పొరేషన్ కమిషనర్ అనిల్ కుమార్లకు తెలంగాణ సివిల్ సప్లరు, జీసీసీ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్లు స్పందిస్తూ తక్షణమే హమాలీలకు రావాల్సిన బకాయిలను ఇప్పిస్తామనీ, జీసీసీి హమాలీలకు పీఎఫ్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అనంతరం వంగూరు రాములు, సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రమేర్పడ్డాక నాలుగు సార్లు సివిల్ సప్లరు, జీసీసీ హమాలీల ఎగుమతి-దిగుమతి ఒప్పందాలు జరిగాయన్నారు. ఆ సమయంలో హమాలీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేస్తామనీ, హెల్త్ ఇన్సూరెన్స్ అమలుకు ప్లాన్ చేస్తామని ఇచ్చిన జీవోలు నేటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఏడాది రేట్ల ఒప్పందం జరిగి జీవో జారీ చేసినప్పటికీ చెల్లింపులో మాత్రం అధికారులు జాప్యం చేస్తున్నారని వాపోయారు. వెంటనే అమలు చేయాలనీ, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్మికులకు రావాల్సిన డబ్బులను చెల్లించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ గుర్తింపు కార్డులివ్వాలనీ, జీసీసీ హమాలీలకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలని వారు కోరారు.