Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్
కన్స్ట్రక్షన్ ఇండిస్టీ డెవలప్మెంట్ కౌన్సిల్ (న్యూఢిల్లీ) నిర్మాణ నైపుణ్య అభివృద్ధి అచీవ్మెంట్ 14వ అవార్డును 'న్యాక్' గెలుచుకుంది. ఈ అవార్డును జాతీయ నిర్మాణ అకాడమీ డైరెక్టర్లు ఇటీవల న్యూఢిల్లీలో ఐసీఏఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆ సంస్థ డైరెక్టర్ జనరల్, డైరెక్టర్లు స్వీకరించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ వీటిని ప్రధానం చేశారు. న్యాక్‌కు ''నిర్మాణ నైపుణ్య అభివృద్ధి అచీవ్మెంట్'' విభాగంలో ప్రతిష్టాత్మక విశ్వకర్మ అవార్డు రావడం పట్ల న్యాక్ వైస్ చైర్మెన్, రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న్యాక్ గత ఏడాదిలో 21,240 మంది వ్యక్తులకు నిర్మాణ సంబంధిత శిక్షణా కార్యక్రమాలను నిర్వహించిందని గుర్తు చేశారు. వారిలో చాలా మంది యువతను ప్రయివేటు పరిశ్రమలో విజయవంతంగా ఉపాధి అవకాశాలు కల్పించినందుకు గాను 2023 సంవత్సరానికి భారతదేశంలోనే ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న ఏకైక నైపుణ్యాన్యాభివద్ధి సంస్థ న్యాక్ అని కొనియాడారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును న్యాక్ సంస్థ అందుకోవడం గర్వించదగ్గ విషయం అని మంత్రి అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ పెంచి యువతకు ఉద్యోగ కల్పనకు కషి చేసేందుకుగాను జిల్లాలకు న్యాక్ విస్తరిస్తున్నదని మంత్రి వెల్లడించారు. అవార్డు రావడానికి కషి చేసిన న్యాక్ డైరెక్టర్ జనరల్ కె.బిక్షపతి, డైరెక్టర్లు శాంతిశ్రీ, ఎం.రాజీరెడ్డి, హేమలత, సత్యపాల్‌రెడ్డి తదితరులను మంత్రి అభినందించారు. అవార్డు నేపథ్యంలో డీజీ బిక్షపతి స్పందిస్తూ అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం ద్వారానే భవిష్యత్ సమాజానికి పునాదులు వేయగలమని వ్యాఖ్యానించారు. సమిష్టి కృషి ద్వారా ఈ అవార్డును సాధించగలిగామని చెప్పారు. డైరెక్టర్ శాంతిశ్రీ మాట్లాడుతూ న్యాక్‌కు కార్పొరేట్ సంస్థలు సహకరిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. యువతను శిక్షణను ఇవ్వడంలో న్యాక్ అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నదని గుర్తు చేశారు.