Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత సీఎం కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఊహించని రీతిలో సిలిండర్లు పేలి ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాల పాలయ్యారని తెలిసిన వెంటనే ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజరుకి, ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఎంపీ నామా నాగేశ్వర్ రావులకు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకున్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.
కేటీఆర్ ఆవేదన
వైరా నియోజకవర్గం కారేపల్లి, చీమలపాడు అగ్నిప్రమాదంపైన మంత్రి కె.తారకరామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా అధికారులు, నాయకులను మంత్రి ఆదేశించారు.
బీఆర్ఎస్లో కొనసాగుతున్న చేరికలు
బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతున్నది. వేర్వేరు రాష్ట్రాల్లోని పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న తీరు సమకాలీన రాజకీయాలను ప్రభావితం చేస్తున్నది. మహారాష్ట్రలోని పల్లె పల్లెకు విస్తరిస్తామన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగానే మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్లోకి వలసలు శరవేగంగా సాగుతున్నాయి. బుధవారం హైదరాబాద్‌లో పలువురు రాజకీయ నాయకులతో పాటు పలు రంగాలకు చెందిన వృత్తి నిపుణులు, ప్రముఖులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబి కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు.
నాసిక్ సివిల్ సర్జన్ డాక్టర్ లక్ష్మణ్ సబలే, ఆర్థోపెడిక్ డాక్టర్ బిలాల్ షేక్, అడ్వకేట్ ఎన్.కె.మహాజన్, క్రిస్టియన్ ట్రైబల్ కమ్యూనిటి స్టేట్ ప్రెసిడెంట్ సందీప్ దేవ్రే, లాథూర్‌లోని దేవ్నీ కార్పోరేటర్ సూర్యవంశి అమిత్ విజరు ప్రకాష్, భుసావల్‌కు చెందిన నితిన్ తయాడే, స్వాభిమాని షేట్కారి సంఘటన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమ్ నాథ్ బోరడే, గంగాఖేడ్ మున్సిపాలిటి కార్పోరేటర్లు తుకారం తాండడే, బాలాసాహెబ్ రేక్, పాలం మున్సిపాలిటి కార్పోరేటర్లు బబ్లూ సైయద్, చాంద్ పఠాన్, బీడ్ కో ఆపరేటివ్ బ్యాంక్ మెంబర్ శివాజీ రావ్ ఘోడకే, స్వాభిమాని పక్ష్ జిల్లా అధ్యక్షుడు కుల్దీప్ కర్పే, బీడ్ సేవా సెV్‌ా కారి సంస్థ ఛైర్మన్ కమలాకర్ లాండే, స్వాభిమాన్ పక్ష్ తాలూకా ప్రెసిడెంట్ లాహు గైక్వాడ్, జలగావ్‌కు చెందిన భికు సోనావానే, సోను పాటిల్, సునీల్ రౌత్, విలాస్ మలేస్, నాసిక్‌కు చెందిన సచిన్ కడ్, ముకుంద్ అహిర్, రామ్ నికమ్, బాపు దూబె, ప్రొఫెసర్ చంద్రకాంత్ భచౌ, కార్పోరేటర్, ఎన్సీపి షేలు తహసీల్ ప్రెసిడెంట్ రహీమ్ ఖాన్ పఠాన్ తదితరులు చేరిన వారిలో ఉన్నారు.