Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలోనే పెద్ద విగ్రహం
మధ్యాహ్నం 2.30గంటలకు విగ్రహావిష్కరణ
డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన మనవడు ప్రకాశ్ అంబేద్కర్ హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం కేసీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.. ఈ కార్యక్రమంలో శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీలు,మంత్రులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మెన్లు, జడ్పీ చైర్మెన్లు, నగర మేయర్, ఉన్నతాధి కారులు పాల్గొంటారు. సభావేదికపై నుంచి సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్, కొప్పుల ఈశ్వర్ ప్రసంగించనున్నారు.
- ఎత్తు 125 అడుగులు,45 అడుగుల వెడల్పు
- నేడే ఆవిష్కరణ
- సర్వాంగ సుందరంగా స్మృతి వనొం స్ఫూర్తిదాయక సన్నివేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్..ఈ పేరు తెలియని వారుండరు. ఆయన భారత రాజ్యాంగ నిర్మాత. అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు. మనువాద ప్రమాదాన్ని ఆ నాడే గుర్తించి ..దాని ప్రతుల్ని దగ్దం చేసిన దార్శనీకుడు. ఆ మహానీయుని ఆశయాలకు, ఆయన అందించిన రాజ్యాంగ విలువలకు విఘాతం ఏర్పడిన నేటి పరిస్థితుల్లో అంబేద్కర్ భావజాలానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ విగ్రహావి ష్కరణ ఒక స్ఫూర్తిదాయకమైన సందర్భం..
విగ్రహా విశేషాలు..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని శుక్రవారం (ఏప్రిల్ 14న) ఆవిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ట్యాంక్‌బండ్ సమీపంలోని ఎన్టీఆర్ గార్డెన్ పక్కనున్న 11 ఎకరాల విస్తీర్ణంలో ఆయన విగ్రహాన్ని భారీఎత్తున ఏర్పాటు చేయాలని ప్రభుత్వం 2016లో నిర్ణయించింది. దాని రూపకల్పన బాధ్యతను కేపీసీ ప్రయివేటు లిమిటెడ్ నిర్మాణ సంస్థకు అప్పగించింది. ప్రధాన శిల్పిగా పద్మభూషణ్ రామ్ వన్జీ సుతార్ వ్యవహరించారు. ఆయన కుమారుడు అనిల్ సుతార్ కూడా ఆ ప్రక్రియలో పాలుపంచుకున్నారు. విగ్రహం తయారీకి 353 టన్నుల ఉక్కు, 112 టన్నుల కాంస్యాన్ని ఉపయోగించారు. ఎండలకు,వానలకు సైతం చెక్కుచెదరకుండా ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండే విధంగా విగ్రహాన్ని అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో నిర్మించారు. విగ్రహం కింది భాగం (బేస్మెంట్) ఢిల్లీలోని ప్రస్తుత పార్లమెంటును పోలి ఉంటుంది. విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా, బేస్మెంట్ ఎత్తు 50 అడుగులు. విగ్రహం బరువు 465 టన్నులు. వెడల్పు 45 అడుగులు. ప్రాంగణ విస్తీర్ణం విశాలమైన 11 ఎకరాలతో ఉంది. విగ్రహం చుట్టుపక్కల 2.93 ఎకరాల విస్తీర్ణం పచ్చటి మొక్కలతో, గడ్డి మైదానంతో ఆహ్లాదకరంగా ఉండబోతున్నది. విగ్రహం నిర్మాణం ఖర్చు రూ.145 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ వ్యయాన్ని భరించింది. విగ్రహం సమీపంలో 27,556 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తుల విశాల భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన మ్యూజియం, గ్రంథాలయం, ఆయన రచనలు ఉంటాయి. సభలు సమావేశాలు నిర్వహించుకోవటానికి ఒక కాన్ఫరెన్స్ హాల్‌ను కూడా ఏర్పాటు చేశారు.
స్మతివనంలో..
మరో వైపు అంబేద్కర్ విగ్రహంతోపాటు స్మృతివనాన్ని సైతం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విగ్రహం చుట్టూ రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేప్ ఏరియా, ప్లాంటేషన్, మెయిన్ ద్వారం, ర్యాంప్, వాటర్ ఫౌంటెయిన్, శాండ్ స్టోన్ ఆర్ట్ వర్క్స్, జీఆర్సీ, ఫాల్స్ సీలింగ్, లిఫ్ట్, పార్లమెంట్ బిల్డింగ్ ఆకృతిలో బేస్ మెంట్, మెయిన్ బిల్డింగ్ లోపల ఆడియో, విజువల్ కాన్ఫరెన్స్ హాల్, మ్యూజియం, లైబ్రరీతోపాటు విగ్రహం వద్దకు చేరుకునేందుకు మెట్లదారి వంటివి ఉన్నాయి. అంబేద్కర్ జీవితానికి సంబంధించిన అన్ని విశేషాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.
ఏడాది అనుకుంటే.. ఏడేళ్లు పట్టింది!
2016లో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా హైదారాబాద్ నగరంలో 125 అడుగులతో కూడిన ఈ ప్రతిష్టాత్మక నిర్మాణాన్ని చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అదే ఏడాది ఏప్రిల్ 14 (అంబేద్కర్ జయంతి)న ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో శంకుస్థాపన చేశారు. 2017 ఏప్రిల్ 14లోపు విగ్రహ నిర్మాణం పూర్తి కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం.కాగా వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది.