Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిం చేందుకు వ్యూహం రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ప్రజలను నిరంతరం సంసిద్ధం చేయాలన్నారు. గురువారం బీఆర్కే భవన్లో అగ్ని ప్రమాదాలపై సీఎస్ సమీక్షించారు. అగ్ని ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన పలు భద్రతా చర్యలపై చర్చించారు. ఈ సందర్భం గా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ షాపింగ్ కాంప్లెక్స్‌లు, సినిమా హాళ్లు మొదలైనవాటికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ పని చేస్తుందా? లేదా? అనే దానిపై జీహెచ్ఎంసీ విస్తృత తనిఖీలు నిర్వహించిందన్నారు. అగ్నిమాపక భద్రతా చర్యలపై అవగాహన కల్పించేందుకు నివాస సంక్షేమ సంఘాలను సంప్ర దిస్తున్నామని చెప్పారు. నగరంలోని అన్ని పురాతన భవనాలను గుర్తించి, అగ్నిమాపక భద్రతా పరికరాలను ఏర్పాటు చేయాలని నోటీసులు జారీ చేశామని తెలిపారు. అన్ని షాపింగ్ కాంప్లెక్స్‌లు, మల్టీప్లెక్స్‌లు, ఆస్పత్రులు, ఇతర వాణిజ్య సంస్థలను సకాలంలో తనిఖీలు నిర్వహించి, వాటి ప్రాంగణాల్లో అగ్నిమాపక భద్రతా పరికరాలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చే యాలని జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. రెసిడెన్షియల్ జోన్లలో పనిచేస్తున్న రెడ్ కేటగిరీ సంస్థలను గుర్తించి, వాటిని తరలించేందుకు చర్యలు చేపట్టా ల్సిన అవసర ముందన్నారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, సీసీపీ దేవేందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.