Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూపర్ లగ్జరీ, రాజధాని సర్వీసుల్లో వర్తింపు
- ఈ నెల 30 వరకు అమల్లో 10 శాతం డిస్కౌంట్ : టీఎస్ఆర్టీసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించేం దుకు వీలుగా హైదరాబాద్-విజయవాడ రూట్లో పది శాతం రాయితీ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) నిర్ణయించింది. ఆ రూట్లో నడిచే సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో రాను పోనూ ఈ రాయితీ వర్తించనుంది. ఈ నెల 30 వరకు 10 శాతం డిస్కౌంట్ అమల్లో ఉంటు ంది. హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయ వాడ నుంచి హైదరాబాద్ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు మాత్రమే ఈ రాయితీ వర్తి స్తుంది.
గురువారం ఈ మేరకు టీఆఎస్ ఆర్టీసీ చైర్మెన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్డీ వీసీ సజ్జనార్ ఒక ప్రకటన విడుదల చేశారు. 'విజ యవాడ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువ గా ఉంటుంది. వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీ సుల్లో పది శాతం రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించింది. విజయవాడ మార్గం వరకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఒక ప్రయాణికుడు రాజ ధాని ఏసీ సర్వీస్‌లో హైదరాబాద్ నుంచి విశా ఖపట్నం వెళ్లాలనుకుంటే.. ఆయన టికెట్లో విజయవాడ వరకు 10 శాతం రాయితీ వర్తి స్తుంది. దీని వల్ల ఒక్కో ప్రయాణికుడికి రూ.40 నుంచి 50 వరకు ఆదా అవుతుంది. ఈ నెల 30 వరకు అందుబాటులో ఉండే ఈ రాయితీ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలి'' అని కోరారు. రిజర్వేషన్ కోసం టీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ ww w. tsrtconline. comను సంప్రదించా లని వారు సూచించారు. ముందస్తు రిజర్వే షన్ చేసుకునే ప్రయాణి కులకు టీఎస్ ఆర్టీసీ రాయితీ కల్పిస్తోందని గుర్తు చేశారు. 31 నుంచి 44 రోజుల మధ్యలో అడ్వాన్స్ బుకింగ్ చేసుకు ంటే ఐదు శాతం, 45 నుంచి 60 రోజుల మధ్య లో రిజర్వేషన్ చేసుకుంటే 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్టు తెలిపారు. పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-69440000, 23450033ను సంప్రదించాల ని సూచించారు.