Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ బండా ప్రకాశ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ బండా ప్రకాశ్ తెలిపారు. గురువారం శాసనమండలిలోని తన చాంబర్లో ఇష్టాగోష్టిగా ఆయన మాట్లాడారు. ఏపీ మంత్రులు చిల్లరగా మాట్లాడుతున్నారని విమర్శించారు. హరీశ్‌రావుకు ఉద్యమ నేపథ్యం ఉందన్నారు. ఏపీ మంత్రులకు ఏం ఉందని ప్రశ్నించారు. హరీశ్‌రావుకు పాలనా అనుభవం ఉందనీ, ఏదీ మాట్లాడినా విషయం ఉంటుందని తెలిపారు. చిల్లర వేషాలు...చిల్లర చేష్టలు మానుకోవాలని హెచ్చరించారు. మంత్రులు హైదరాబాద్‌కు రావాల్సి ఉంటుందని మరిచిపోవద్దన్నారు. పిచ్చి మాటలు మాట్లాడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు.