Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాఖ ఉక్కుపై కేంద్రం నిర్ణయాన్ని ఉద్దేశించి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ దెబ్బంటే ఏంటో ఇప్పుడు తెలిసిందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లో నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గటాన్ని ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకుంటామనీ, అందులో భాగంగా బిడ్ వేస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. అందులో భాగంగా ఒక ఉన్నతాధికారుల బందాన్ని విశాఖకు పంపిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. దాంతో ఖంగుతిన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడప్పుడే స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించబోమంటూ వెనక్కి తగ్గిందనీ, ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ ఘనతేనని ఆయన వివరించారు.