Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చీమలపాడు ఘటనలో గాయపడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారిని మంత్రులు కేటీఆర్, పువ్వాడ, ఎంపీలు వద్దిరాజు, నామా నాగేశ్వర్రావు గురువారం పరామర్శిం చారు. మరింత శ్రద్ధతో మెరుగైన సేవలు అందించాల్సిందిగా అధికారులు,వైద్యులను ఈ సందర్భంగా కేటీఆర్ ఆదేశించారు. ప్రభుత్వం,పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. గాయపడిన వారిని అనుక్షణం కంటికి రెప్పలా చూసుకోవాలని,వీరి సహాయ కులు, కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండాల్సిందిగా నిమ్స్ ఓఎస్డీ డాక్టర్ గంగాధర్, డైరెక్టర్ డాక్టర్ బీరప్పలకు కేటీఆర్ పలు సూచనలు చేశారు.సలహాలిచ్చారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వం,పార్టీ కొండంత అండగా ఉంటుందని భరోసానిచ్చారు.