Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడ్డేమానులో 44.2 డిగ్రీలు
- ఉక్కపోత తీవ్రతరం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భానుడు భగభగ మండిపోతూ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతూ పోతున్నాయి. గురువారం మహబూబ్నగర్ జిల్లా వడ్డేమానులో అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ ఏడాది ఇదే అత్యధికం. 28 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికితోడు గాలిలో తేమ శాతం తగ్గడంతో ఉక్కపోత తీవ్రతరమైంది. మధ్యాహ్నం పూట ఫ్యాన్లు తిరుగుతున్నా ఇంట్లో ఎండవేడిమికి సామాన్యులు తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో వీలైనంత మేరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు అత్యవసరం అయితేగానీ బయటకు వెళ్లవద్దనీ, పిల్లలు, వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తగు జాగ్రత్తలు తీసుకుని, వాటర్ బాటిళ్లు తీసుకుని బయటకు వెళ్లాలని చెబుతున్నారు. గురువారం సాయంత్రం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. పలుచోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా సరూర్నగర్లో అత్యధికంగా 1.93 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలో గురువారం 22 చోట్ల(గురువారం రాత్రి 9 గంటల వరకు) 22 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది.