Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మెడలువంచి ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధిస్తానన్న సీఎం జగన్మోహన్రెడ్డి మాట తప్పి, మడమ తిప్పడం లేదని సీపీఐ ఏపీ కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఆంధ్రాలో అభివృద్ధి లేదన్న తెలంగాణ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలను తప్పు పడుతున్న ఏపీ మంత్రులకు రామకష్ణ గురువారం చురకలంటించారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో అభివృద్ధి సాధించిన విషయం హరీశ్‌రావుకు తెలియదా? అంటూ ప్రశ్నించారు.
దేశంలో జగన్మోహన్రెడ్డి కన్నా ఎక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా?అంటూ అడిగారు.
ఆదానీకి ఏపీలోని పోర్టులు, విద్యుత్ ఒప్పందాలు, వేలాది ఎకరాల భూములు కట్టబెట్టడం కనపడలేదా? అంటూ ఎద్దేవా చేశారు. పైన చెప్పిన ఇన్ని అంశాల్లో అభివృద్ధి కనబడుతున్నా ఏపీలో అభివృద్ధి లేదంటూ హరీశ్‌రావు చెప్పటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు.