Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'నవతెలంగాణ' కథనానికి స్పందన
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
'మిషన్ భగీరథ' శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ల్యాబ్ సిబ్బందికి జీతాలు వచ్చాయి. అయితే, ఏడాదిగా జీతాలు రాక అవస్థలు పడ్డారు. ఎన్నిమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న సుమారు 400 మంది ఏడాది పొడవునా వేతనాలు రాక అప్పులపాలయ్యారు. వారి బాధలు వివరిస్తూ 'భగీరథ'లో బతుకు భారం అనే శీర్షికతో 'నవతెలంగాణ' పత్రిక మెయిన్ పేజీలో ఈనెల 7న కథనాన్ని ప్రచురించింది. దాంతో స్పందించిన ప్రభుత్వం మిషన్ భగీరథలోని ల్యాబ్ సిబ్బందికి పెండింగ్లో ఉన్న వేతనాలను గురువారం విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, తమ బాధలు పత్రికలో ప్రచురించిన 'నవ తెలంగాణ' యాజమాన్యానికి భగీరథ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.