Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శంకరలక్ష్మి,సత్యనారాయణలను విచారించిన ఈడీ
- సిట్ నుంచి దర్యాప్తు పత్రాలు ఇప్పించాలని కోర్టును కోరిన ఈడీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఆ విభాగం కాన్ఫిడెన్షియల్ సెట్ ఇంచార్జ్ శంకరలక్ష్మి, అడ్మిన్ సూపరింటెండెంట్ సత్య నారాయణలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం విచారించారు. దాదాపు నాలుగు గంటల పాటు వీరిద్ధరిని వేర్వేరుగా ఒకసారి, ఇద్దరిని కలిపి ఒకసారి ఈడీ అధికారులు విచారించినట్టు తెలిసింది.
ముఖ్యంగా, ప్రశ్నా పత్రాలకు కస్టోడియన్‌గా ఉన్న శంకర్లక్ష్మి వద్ద రహస్యంగా ఉండాల్సిన కంప్యూటర్ పాస్వర్డ్ ఏ విధంగా మూడో చేతికి మారిందనే విషయమై ఆమెను నిశితంగా ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. అలాగే, ఈ లీక్‌పై మొదట బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సత్యనారాయణను ఈ పేపర్‌లీక్ అంశం ఏ విధంగా మొదట బయటపడిందనే కోణంలో ఈడీ అధికారులు ప్రశ్నించారని సమాచారం.
అలాగే, ఈ కేసులో నిందితులైన టీఎస్పీఎస్సీ చైర్మెన్ పీఏ ప్రవీణ్, ఈ విభాగం కంప్యూటర్లను పర్యవేక్షించే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ల ప్రవర్తన గురించి కూడా ఈడీ ఇద్దరు అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. ముఖ్యంగా, ఈ కేసు దర్యా ప్తులో శంకరలక్ష్మి, సత్య నారాయణల సహకారం ఎంతగానో అవసరమనీ, విచారణకు తామెప్పుడు పిలిచినా హాజరు కావాలని ఈడీ అధికారులు కోరి నట్టు తెలిసింది.
ఈ కేసుపై ఇప్పటి వరకు రాష్ట్ర సిట్ అధికారులు జరిపిన దర్యాప్తునకు సంబంధిం చిన పత్రాలను ఆ విభాగం తమకు ఇవ్వడం లేదనీ, ఈ విషయంలో ఆ విభాగం సానుకూలంగా స్పందించే లా ఆదేశాలివ్వాలని కోరుతూ గురువారం నాంపల్లి కోర్టును ఈడీ అధికారులు ఆశ్రయించారు. అయితే, తాము జరుపుతున్న దర్యాప్తునకు సంబం ధించిన అంశాలతో కూడిన పత్రాలను హైకోర్టుకు అందజేశా మనీ, ఈ నేపథ్యంలో హైకోర్టు పరిశీలనలో ఈ అంశం ఉన్న కారణంగా ఈడీకి పత్రాలివ్వలేమని సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.