Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ కార్యదర్శికి తపస్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వేసవి కాలంలోనే ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులను చేపట్టేలా ప్రత్యేక చొరవ చూపాలని తపస్ కోరింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఏవీఎన్తో తపస్ అధ్యక్షులు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్, ఏబీఆర్ఎస్ఎం ప్రతినిధి సూరం విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య కలిసి వినతిపత్రం సమర్పించారు. విద్యారంగంలో నెలకొన్న దీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని కోరారు. పాఠశాల నిర్వహణ కోసం వచ్చే గ్రాంటులను బడుల ప్రారంభం నాటికి విడుదల చేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లు తప్పకుండా ఉండాలని, లేదంటే పాఠశాలలను మంచి వాతావరణంలో నడపడం ఇబ్బందికరంగా ఉంటుందని పేర్కొన్నారు. మన ఊరు మన బడి అన్ని పాఠశాలల్లో రెండో విడత ప్రారంభం చేసి సత్వరం పని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి పాఠశాలలో కంప్యూటర్ విద్య బోధకున్ని ఏర్పాటు చేయాలని సూచించారు. సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆ తర్వాత నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఈ కుబేర్ ద్వారా మంజూరు చేయాలని కోరుతూ ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావును వారు కలిశారు.