Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు అంబేద్కర్ విగ్రహావిష్కరణ..
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిర్మించిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో శుక్రవారం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హుస్సేన్ సాగర్ తీరంలో 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. నగరవాసులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రజలు, అభిమానులు, అధికారులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఐమాక్స్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, మింట్ కంపౌండ్ మార్గాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ సీపీ సుధీర్ బాబు గురువారం తెలిపారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
8 వీవీ విగ్రహాం(ఖైరతాబాద్), ఓల్డ్ సైఫాబాద్ పోలీసు స్టేషన్ జంక్షన్, రవీంద్ర భారతీ జంక్షన్, మింట్ కంపౌండ్ రోడ్డు, నెక్లెస్ రోడ్, నల్లగుట్ట జంక్షన్, కట్ట మైసమ్మ టెంపుల్(లోయర్ ట్యాంక్ బండ్), ట్యాంక్ బండ్, లిబర్టీ జంక్షన్ వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి.
8 అఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను ట్యాంక్‌బండ్ వైపునకు అనుమతించరు. ఈ మార్గంలో వచ్చే ఆర్టీసీ బస్సులను రవీంద్ర భారతి, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, కట్ట మైసమ్మ టెంపుల్, లోయర్ ట్యాంక్ బండ్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ మార్గాల్లో అనుమతించనున్నారు.