Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ సిద్ధాంతం విశ్వజనీనం
రాబోయే రాజ్యం మనదే.దేశవ్యాప్తంగా ఏటా 25లక్షల కుటుంబాలకు దళిత బంధు.అంబేద్కర్ పేరిట ప్రభుత్వ అవార్డు. మంచి పనులు చేసే వారిని ప్రజలు ప్రొత్సహించాలి
-అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ సభలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'ఇక్కడ మనం అవిష్కరించింది కేవలం అంబేద్కర్ విగ్రహం కాదు..అది ఒక విప్లవం, ఆయన తెలంగాణ కలల సాకార దీపిక. బాబాసాహెబ్ విశ్వమానవుడు. ఆయన సిద్ధాంతం విశ్వజనీనం. అంబేద్కర్ ఆశ యాల సాధన కోసం తెలం గాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది.' అని ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో అత్యంత ప్రతిష్టాత ్మకంగా నిర్మించిన అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.
రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయానికి నిత్యం వచ్చి పోయే మంత్రులు, ఉన్నతాధికారుల్లో సమతా స్ఫూర్తి నింపేందుకే అంబేద్కర్ నిలు వెత్తు విగ్రహాన్ని సచివాల యానికి దగ్గరలో ప్రతిష్టిం చామని ఆయన చెప్పారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏండ్లు దాటినా దళి తులకు, అణగారిన వర్గాలకు న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గ్రహించాలనీ, మంచి పనులు చేసే వారిని ఆదరించాలని కేసీఆర్ సూచించారు. తమ ప్రభుత్వం పదేండ్లలో దళితుల అభివృద్ధి కోసం లక్షా 25వేల కోట్లు ఖర్చు చేసిందనీ, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు అమలు చేస్తున్నామని కేసీఆర్ వివరించారు. బీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత మహారాష్ట్రలో మంచి ఆదరణ లభించిందని, యూపీ, బీహార్, బెంగాల్లో కూడా అవే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. దేశంలో రాబోయే రాజ్యం మనదేననీ, ఏటా 25లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు ఇచ్చి తీరుతామని దాయన ప్రకటించారు. ప్రజలు గెలిచే రాజకీయం రావాలని ఆకాంక్షించారు. రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అంబేద్కర్ మహోన్నత విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు తన జన్మదన్యమైందని అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో లక్షా 25వేల దళిత కుటుంబాలకు దళిత బంధు అమలు చేస్తామని సభాముఖంగా ప్రకటించారు. ప్రసంగం ప్రారంభంలో కేసీఆర్ చేసిన జై భీం నినాదాలకు ప్రజలనుంచి విశేష స్పందన లభించింది. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం అమలవుతున్న పథకాలను వివరించారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. సీఎస్ శాంతకుమారి స్వాగతోపన్యాసం చేస్తూ.. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ప్రపంచంలోనే ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. అంబేద్కర్ విగ్రహం ప్రజలందరి నిత్య చైతన్య దీప్తి అని అన్నారు. సభా ప్రారంభంలో ప్రకాశ్ అంబేద్కర్‌ను సీఎం కేసీఆర్ ఘనంగా సన్మానించారు. దళిత ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీస్(డిక్కీ)కి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రెండెకరాల భూమి పట్టాను ఆ సంస్థ బాధ్యులు నర్రా రవికుమార్‌కు సీఎం అందజేశారు.'దళిత బంధు విజయగాథలు' వీడియో సీడీని ప్రకాశ్ అంబేద్కర్ ఆవిష్కరించారు.
దేశంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమవుతున్నాయి: ప్రకాశ్ అంబేద్కర్
దేశానికి రక్షణ పరంగా హైదరా బాద్‌ను రెండో రాజధానిగా చేయాలని అంబేద్కర్ ఆనాడే చెప్పారనీ, అది నెరవేరాలని తాను కోరుకుంటు న్నానని ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరయిన ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. దేశంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమవుతున్నాయనీ, మార్పు కోసం యుద్ధం చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడిందని వివరించారు. దీనికి కేసీఆర్ దిశా నిర్దేశం చేశారని చెప్పారు. దేశంలో మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలు మాత్రమే లేవనీ, కుల పరంగా మైనార్టీలు కూడా ఉన్నారని చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపర్చిన నిబంధన మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరిగాయని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో కార్యాచరణ మొదలు పెట్టి దేశ వ్యాప్తంగా ఉద్యమించాలని కోరారు. దేశంలో జాతీయ నాయకుడిగా చెప్పుకునే వారెవరూ లేరనీ, తెలంగాణ దేశానికి దిక్చూచిగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధు గొప్ప కార్యక్రమమనీ, దాని ఫలితాలు త్వరలో కనిపిస్తాయని ప్రకాశ్ అంబేద్కర్ చెప్పారు.
హుస్సేన్ సాగర్ తీరంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ మహా కాంస్య విగ్రహాన్ని ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హెలీకాప్టర్ నుంచి అంబేద్కరునిపై పూల వర్షం కురిపించగా.... జై భీం నినాదాలతో సాగర తీరం మార్మ్గింది. కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్, మంత్రులు, అధికారులతో పాటు తరలి వచ్చిన ప్రజలంతా అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బేస్ భవన్లో ఏర్పాటు అంబేద్కర్ ఫొటో ఎగ్జిభిషన్‌ను వారు తిలకించారు. ఎస్సీ కార్పొరేషన్ రూపొందించిన ఆత్మబంధువు అంబేద్కరుడు డాక్యుమెంటరీని సీఎం, ప్రకాశ్ అంబేద్కర్ తిలకించి సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఆకట్టుకున్న కళా రూపాలు..
విగ్రహావిష్కరణ సందర్భంగా సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో నిర్వహించిన కళారూపాలు.. ఉర్రూతలూగించాయి. అంబేద్కర్ జీవితం, ఆయన ఆదర్శాలు, ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఉద్దేశించిన ఆలపించిన పాటలు సభికులతో హర్షద్వానాలు చేయించాయి.