Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గులాబీ గూటికి వివిధ పార్టీల కీలక నేతలు : ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్లో చేరడానికి వివిధ పార్టీల నేతలు వస్తున్నారని పీయూసీ చైర్మెన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్‌రెడ్డి తెలిపారు. ఔరంగాబాద్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వివిధ పార్టీల కీలక నేతలు గులాబీ గూటికి చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ఔరంగాబాద్ తాలుకా ప్రెసిడెంట్ నితిశ్రాథోడ్, బంజారా బ్రిగెేడ్ జిల్లా అధ్యక్షుడు చత్రపతి మఖేష్రాథోడ్, బంజారా బ్రిగేడ్ జిల్లా ఉపాధ్యక్షులు సంతోష్‌రాథోడ్, లల్లారాథోడ్, వినోద్చౌహాన్, సందీఒ రాథోడ్, ప్రేమ్‌దాస్ రాథోడ్ తదితరులు కూడా బీఆర్ఎస్పార్టీలో ఉన్నారు. మహరాష్ట్ర జయ సంఘర్ష్ వెహికిల్ డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంజరు హల్నర్, వైస్ ప్రెసిడెంట్ అబ్బాస్‌ఖాన్, కమిటి సభ్యులు రమేష్ కోల్తే, రవింద్ర షడ్కే, సోమనాథ్ గైక్వాడ్, రవింద్ర అడావ్, జ్నానేశ్వర్ హల్నర్ తదితరులు చేరారు. ఇంకా మానోహిత్ లోక్షై పక్ష్ పార్టీ సంఘటన్ జిల్లా అధ్యక్షుడు కష్ణ గైక్వాడ్ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మోడల్ తమ రాష్ట్రంలోనూ అమలు కావాలంటే బీఆర్ఎస్తోనే అది సాధ్యమని మహారాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ కార్పోరేషన్ ఛైర్మెన్ వేణు గోపాలచారి, ఔరంగాబాద్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు హర్షవర్దన్ జాదవ్, అభరుపాటిల్, ఖదీర్ మలనా, దిలీప్ గోరే, అంకిత్ యాదవ్, శివాంజ్ యాదవ్ తదితరులు కూడా పాల్గొన్నారు.