Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'గ్రీన్ ఇండియా చాలెంజ్'లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ శుక్రవారం హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టులో మొక్కనాటారు. 'తనను కలవాలనుకునే వారు తప్పనిసరిగా మొక్కలు నాటాలని చెప్పిన మా తాత బిఆర్ అంబేద్కర్'' గారి స్పూర్తిని కొనసాగిస్తున్న 'గ్రీన్ ఇండియా చాలెంజ్' సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆశయం గొప్పదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ''మనుషుల్లో సమానత్వం ప్రకృతి సమతుల్యత'' కోసం పరితపించిన మా తాత డా.బీఆర్. అంబేద్కర్ గారి జయంతి రోజున ఈ అద్భుతమైన కార్యక్రమంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. మా తాత ''కేంద్ర న్యాయశాఖ మంత్రి''గా ఉన్నప్పుడు తనను కలవాలనుకునే ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటిన తర్వాతే కలిసేందుకు రావాలని కోరుకున్నారు. మొక్కలు నాటడం పట్ల ఆయనకు అమితమైన ఆసక్తి ఉండేది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ స్ఫూర్తిని గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో చూస్తున్నాను.'అని ప్రకాశ్ అంబేద్కర్ చెప్పారు. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని నిర్విఘ్నంగా ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమారి కృషి అనితరసాధ్యమైందని అన్నారు. ఈ మధ్యలోనే గ్రీన్ ఇండియా చాలెంజ్ లిమ్కాబుక్‌లో చేరడం తనకు చాలా ఆనందం కలిగించిందన్నారు. ఈ కృషికి మరింత గుర్తింపు రావాలని కోరారు. ప్రకృతి పచ్చదనంతో పరిఢవిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ బృందానికి ప్రకాశ్ అంబేద్కర్ హదయపూర్వక శుభాకాంక్షలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో పాటు గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సంజీవ రాఘవ పాల్గొన్నారు.