Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
క్రీడలు మానసిక వికాసానికి ప్రతీకలనీ, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని రాష్ట్ర క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన జాతీయ స్థాయి డ్రాప్ రో బాల్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పథకాలు సాధించిన విద్యార్థులను శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో సత్కరించి అభినందించారు. తెలంగాణ రాష్ట్ర డ్రాప్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నారు. అండర్ - 15 సబ్ జూనియర్ బాలికల విభాగంలో నల్లగొండ జిల్లా చండూరు గాంధీజీ పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న రుక్సర్ ఉన్నిసా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నది. అండర్ -15 బాలుర విభాగంలో అదే పాఠశాలకు చెందిన ఎమ్డీ సైఫ్ రజతం పతకాన్ని సాధించాడు. అండర్ -21 యూత్ బాలుర విభాగంలో చండూరు కు చెందిన ఈ. తరుణ్, నాంపల్లికి చెందిన డి. అరుణ్‌లు రజత పతకాన్ని సాధించారు. అభినందన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డ్రాప్ రో బాల్ కార్యదర్శి ఎమ్డీ రహమత్, డ్రాప్ రోబాల్ టెక్నికల్ అబ్జర్వర్ ఎమ్డీ అక్బర్ బాబా, పి. గణేష్, బి.నవీన్, బి. సాయిరాం, బి.లక్ష్మణ్, కే. శంకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.