Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చలివేంద్రాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీనియర్ నాయకులు జి.రఘుపాల్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందనీ, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని చెప్పారు.
టీపీఎస్కే నాయకులు భూపతి వెంకటేశ్వర్లు భారత రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేయించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రఘుపాల్ ప్రారంభిం చారు. చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఎస్వీకే ట్రస్టు కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్వీకె మేనేజర్ జి. బుచ్చిరెడ్డి, రమణరావు, ఎస్వీకె సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.