Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్ జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వివిధ రంగాల్లో దేశానికి ఎనలేని సేవలందించిన మహానేత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ అని ఏఐకేఎస్ జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి కొనియాడారు.పేదరికంతో సంబంధం లేకుండా ఉన్నత విద్యను అభ్యసించి భారత రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి దిశానిర్దేశం చేశారని గుర్తు చేశారు. శుక్రవారం హైదరాబాద్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా సారంపల్లి మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై బీఆర్ఎస్, ఆర్ఎస్ఎస్ ఎన్నో కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టును ఎత్తివేసేందుకు మోడీ సర్కారు ప్రయత్నిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మానువాదాన్ని అమలు చేసేందుకు, రిజర్వేషన్లను తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని చెప్పారు. అలాంటి బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మిక, మహిళా చట్టాలను తొలగించేందుకు కూడా పావులు కదుపుతున్నాయని విమర్శించారు. పేద ప్రజలకు సేలం దిస్తున్న రైల్వే రక్షణ రంగాలు, బీఎస్ఎన్ఎల్, విమానాశ్రయాలు, పోస్టు ఆఫీసులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీస,ీ మైనార్టీలు ఏకమై బీజేపీ, ఆర్ ఎస్ఎస్ కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, పద్మ, కిషోర్, ఆర్.ఆంజనేయులు, రాహుల్ పాల్గొన్నారు.