Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
- దళిత బంధు సాహసోపేత పథకమంటూ వ్యాఖ్య
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే తెలంగాణాయే లేదనీ, ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించు కోగలిగామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు. అంబేద్కర్ జయంతి సంద ర్భంగా శుక్రవారం హైదరాబాద్ పంజగుట్ట కూడలిలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్మున్న నేత అని చెప్పారు. కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు.. సాహసోపేతమైన పథకమని కొనియాడారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. కొత్త పార్లమెంట్‌కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. పంజాగుట్ట కూడలికి అంబేద్కర్ పేరు పెడతామని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహముద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.