Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతిని శుక్రవారం హైదరాబాద్ లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిం చారు. అంబేద్కర్ చిత్ర పటానికి ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ..సామాజిక వారోత్సవాలను ఏప్రిల్ 6 బిటిఆర్ వర్ధంతితో ప్రారంభమై ఏప్రిల్ 14 నేటితో ముగిశాయని తెలిపారు. సామాజిక సమస్యలపైన అధ్య యనం, సర్వేలు, సామాజిక సంఘీభావ నిధిని కార్మికుల నుంచి సేకరించా మన్నారు. అంబేద్కర్ విగ్రహాలను కోరుకోలేదనీ, ప్రభుత్వ భూములు, సంస్థ లు ప్రయివేటీకరించొద్దని కోరుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, పి. శ్రీకాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న పి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.